అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచిన పురాతన నాణేలు (Ancient coins) మాయమయ్యాయి. ట్రెజరీ అధికారి మెహబూబ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో
నాణేలు మాయమయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నలుగురు ట్రెజరీ ఉద్యోగులపై అనుమానంతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో నలుగురు ఉద్యోగుల పేర్లు బయటపడడంతో వారిపై సస్పెన్షన్ (Suspension) వేటు వేశారు. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి సయ్యద్ అమినుద్దీన్, అటెండర్ విష్ణువర్దన్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ రమేశ్‌రెడ్డితో మరొకరు సస్పెన్షన్‌కు గురయ్యారు.