Anchor Shyamala | సార్వత్రిక ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్‌గా మారారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు కూడా వేశారు. ఇవి కాస్త టీడీపీ, జనసేన నేతల మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో ఆమెను చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జగన్ వెన్నంటే ఉన్నారు. జగన్ కోసం ఆమె పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించింది. వైసీపీలో ఆమెకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత నష్ట నివారణ చర్యలకు దిగిన వైఎస్ జగన్.. వైసీపీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నలుగురికి అవకాశం ఇచ్చారు. ఇందులో యాంకర్ శ్యామల కూడా ఉంది. ఆమెను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
యాంకర్ శ్యామలతో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావులను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ (పీఏసీ సభ్యుడు)గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగానూ బాధ్యతలు అప్పగించారు.
Ycp