అమరావతి : అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో ఘోరం జరిగింది . ఏనుగుల దాడి (Elephants Attack ) లో వృద్ధుడు చనిపోయిన ఘటన కొమరాడ మండలం వన్నాం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. శివుడినాయుడు (62) అనే వృద్ధుడు (Old man) సమీప వాగులో స్నానం చేసి ఇంటికి వెళ్తుండగా అరటితోటలో ఉన్న ఏనుగులు అతడిపై దాడి చేశాయి. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు పోలీసులకు (Police) , అటవిశాఖాధికారులకు (Forest Officials) సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఏపీలోని చిత్తూరు, మన్యం ఏనుగుల బీభత్సవాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇటీవల కర్ణాటక ప్రభుత్వం (Karnataka government) తో చర్చించింది.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్( Pawan Kalyan) స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవి మంత్రి, అక్కడి అధికారులతో మాట్లాడి కుంకీ ఏనుగుల కొరతను వారికి వివరించారు. కర్ణాటక, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల సమస్య అధికంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. అనంతరం 8 కుంకీ (Kunki Elephant) ఏనుగులను ఏపీకి అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది.