MLA Gottipati | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని సూర్యాపేట వద్ద ప్రమాదానికి గురైంది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రవి కుమార్ హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత ఆయన మరో కారులో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.