అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అధికార మార్పిడిపై తెలుగు సినీ నటుడు పృథ్విరాజ్(Actor Prithviraj ) తనదైనశైలీలో సెటైర్లు (Satirizes) వేశారు. ముఖ్యంగా వైసీపీపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. వైసీపీ (YCP) కి గతంలో ఉన్న 151 మెజార్టీలో 5 అనే అంకెను ప్రజలు క్రేన్ సహాయంతో లేపేసి, కేవలం 11 అంకెకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు.
బుధవారం విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పవన్‌ను అభినందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలపై వైసీపీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇది ప్రజాతీర్పు. ప్రజల తీర్పును శిరస్సావహిస్తున్నాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలు తమను వద్దని అనుకున్నారని వైఎస్ జగన్ హుందాగా అంటే అతనిపై గౌరవం పెరిగేదని అన్నారు. అలా కాకుండా ఈవీఎం(EVM) లు ట్యాంపరింగు జరిగిందని, ఏపీ బీహార్‌లా మారిందని పలు రకాలుగా ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు.
అసెంబ్లీలో వైసీపీ నిర్మాణాత్మకం పాత్ర పోషించడానికి 18 మంది ఎమ్మెల్యేలు లేరని ఆరోపించారు. పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా పవన్‌కల్యాణేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అద్భుత పరిపాలనకు ప్రజలు నాంది పలికారని తెలిపారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఫోటోలు పెట్టడం శుభపరిణామమని అన్నారు.