అమరావతి : ఏపీలో సంచలనం కలిగించిన టీడీపీ అభ్యర్థి(TDP Candidate) పులివర్తి నాని(Pulivarthi Nani)పై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితులతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్టు (Accused arreste) చేశారు. ఈనెల 14న పోలింగ్ అనంతరం తిరుపతిలోని పద్మావతి కళాశాలలో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. వీటిని పరిశీలించేందుకు పులివర్తినాని గన్మెన్ల సహాయంతో స్ట్రాంగ్‌రూం(Strong room) పరిశీలనకు వెళ్లారు.
కళాశాల ప్రధాన గేట్ వద్ద వైసీపీకి చెందిన నాయకులు కారును అడ్డగించి మారణాయుధాలతో నాని కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన గన్‌మెన్‌పై , నానిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో పాల్గొన్న ప్రధాన నిందితులు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితో పాటు మరో 11 మందిని అరెస్టు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. గురువారం వారికి 14 రోజుల పాటు రిమాండ్ (Ramand) విధించడంతో వారిని చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు.