Tirupati | కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామి క్షేత్రమైన తిరుమలలో ఈ నెల 10 నుంచి వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. అయితే, టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనాలు కల్పించడం సాధ్యం కాదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఆయా కౌంటర్లలోనే టోకెన్లు జారీ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే తిరుపతిలో బుధవారం రాత్రి టోకెన్ల కోసం భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తోపులాట జరిగింది. శ్రీనివాసం వద్ద తోపులాటలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు.
దాంతో వారిని స్థానికంగా ఉన్న ఉయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద జరిగిన తోపులాటలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. సత్యనారాయణపురంలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద సైతం తోపులాట చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు టీడీపీ కల్పించనున్నది. కల్పించనున్నది. ఈ నెల 9న తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని కౌంటర్లలో ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఉదయం 5 గంటల నుంచి టికెట్లు జారీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం తరలివచ్చారు. దాంతో భక్తులు రోడ్లపై గుమిగూడకుండా పార్కులో సిబ్బంది వారిని ఉంచారు. భక్తులను పద్మావతి పార్క్ నుంచి క్యూలైన్లలోకి వదిలే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలానికి చెందిన మహిళా భక్తురాలు మృతి చెందింది. ఆమెతో పాటు మరో ముగ్గురు భక్తులు మృతి చెందినట్లు సమాచారం పలువురు అస్వస్థతకు గురవగా వారిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని మోహరించినట్లు టీటీడీ చైర్మన్ ప్రకటించినా.. తొక్కిసలాట చోటు చేసుకోవడం గమనార్హం.