Botsa Satyanarayana | ఏపీలో అరాచకాలపై జాతీయ స్థాయి ఉద్యమం : బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana | రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై జాతీయ స్థాయి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
అమరావతి : రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై జాతీయ స్థాయి ఉద్యమం ( National level Movement ) చేయడానికి సిద్ధంగా ఉన్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana) వెల్లడించారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ ఉద్యమం కోసం వైఎస్ జగన్‌తో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం చట్టాలను చేతుల్లోకి తీసుకుని వైసీపీ నాయకులపై మూడ్రోజులుగా దుర్మార్గానికి పాల్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి ఇళ్లు దహనం, జోగి రమేష్ ఇంటిపై పెట్రోలు బాంబులు వేయడం దౌర్జన్య పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. జరుగకూడని సంఘటన జరిగితే అందుకు బాధ్యులెవరంటూ ప్రశ్నించారు. రాష్ట్రం మరో బిహార్ మాదిరిగా తయారవుతుందని ఆరోపించారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు నియమించబడ్డ రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు వద్ద ఉడుంగి పనికోసం కాదని అన్నారు.దాడులు ప్రోత్సహించి చంద్రబాబు అప్రతిష్ట మూటకట్టుకోవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో ఏదో ఒక సమస్య వస్తే దానిని డైవర్ట్ చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడేవిధంగా అనేక రకాలు కుట్రలు చేస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో హింసకాండ జరిగితే బీజేపీ, జనసేన ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
అంబటి రాంబాబు ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదని అన్నారు. కేంద్ర మంత్రి పౌరుషంగా మాట్లాడడంపై అభ్యంతరం సంపద సృష్టిస్తామని చెప్పి విశాఖలో ఉన్న రూ.5 వేల కోట్ల విలువైన భూములను కుటుంబ సభ్యులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి తాటాకు చప్పుళ్లకు వైసీపీ బెదరదని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

