Tirumala | తిరుమలలో కొత్త రకం మోసం వెలుగుచూసింది. లాకర్ల పేరుతో భక్తుల నుంచి డబ్బులు గుంజుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని సాఫ్ట్వేర్ ఉద్యోగి తిలక్గా గుర్తించారు.
తిరుమలకు వచ్చి లాకర్లు తీసుకున్న భక్తులకు తిలక్ టీటీడీ ఉద్యోగిగా ఫోన్ చేస్తాడు. లాకర్ నిర్ణీత గడువులోగా ఖాళీ చేయలేదు కాబట్టి ఫైన్ కట్టాలని బెదిరిస్తాడు. అలా భక్తులను తన వద్దకు పిలిపించుకుని వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. ఓ మహిళా భక్తురాలికి తిలక్ ఇలాగే కాల్ చేసి బెదిరించడంతో.. అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, అసలు భక్తుల వివరాలు తిలక్ వద్దకు ఎలా వెళ్లాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో టీటీడీ ఉద్యోగుల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.