హైదరాబాద్ : సత్యసాయి జిల్లాలో( Satyasai district) దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని కొడవలితో(Sickle) నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి సంపత్రాజును(Lawyer killed) సత్యసాయి జిల్లా ధర్మవరం చెరువు కొడవలితో నరికి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంపత్రాజు హత్యకు భూ తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.