అమరావతి : ఏపీలో విషాదం నెలకొంది. చెట్టుపై పండిన రేగుపండ్లను తిన్న నలుగురు తీవ్ర అస్వస్థతకు గురికాగా వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కోసిగి గ్రామంలో చెట్టు నుంచి రేగిపండ్లు తెంపిన మహిళతో పాటు ముగ్గురు చిన్నారులు వాటిని తిన్నారు. కొద్దిసేపటికే వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా హర్ష(2) అనే చిన్నారి మార్గమధ్యలో మృతి చెందింది. అస్వస్థతకు గురైన మహాదేవి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందజేస్తున్న వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన అంజి, శ్రీరాములును ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు.