అమరావతి : సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA ) కోనేటి ఆదిమూలం(Koneti Adimulam) పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తిరుపతిలోని బీమాస్ హోటల్(Hotel) లో తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. తనపై లైంగిక వేధింపులకు (Sexually harassment) పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితురాలు కొన్ని వీడియోలను విడుదల చేసింది.
దీంతో స్పందించిన టీడీపీ అధిష్టానం వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెన్షన్ చేసింది. కాగా ఘటనపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. భీమాస్ ప్యారడైజ్ హోటల్లో ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఎమ్మల్యేపై బలాత్కారం, బెదిరించి అత్యాచారం చేశారని కేసు నమోదు చేశామన్నారు.