అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది . దుండగులు దంపతులను దారుణంగా హత్య చేశారు. వారి వద్ద ఉన్న బంగారు అభరణాలను దొంగిలించారు. 25 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా నుంచి వచ్చి నెల్లూరులోని అశోక్‌నగర్‌లో ఉంటున్న వసురెడ్డి కృష్ణారెడ్డి, సునీత అనే దంపతులు స్థానికంగా శ్రీరామ్ క్యాం టీన్ నడుపుతున్నారు. రాత్రి దుండగులు వారి ఇంటిలోకి చొరబడి దంపతుల గొంతును కోసి దారుణంగా హత్య చేశారు.
రక్తపు మడుగులో ఉన్న దంపతులను ఇవాళ ఉదయం పాలు పోసేందుకు వచ్చిన మహిళచూసి పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా దుండగులు హత్యకు ఉపయోగించి న కత్తి, కర్రను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.