అమరావతి : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తుందని, ఈ కాలంలో ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్న మూడేండ్ల పాలనపై ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 95 శాతం హామీలు అమలు చేశామని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తానని , ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలానే ఉండాలని ఆకాంక్షించారు.