హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి ట్రస్ట్‌కు ఓ భక్తు డు భారీ విరాళం అందజేశారు. కర్ణాటక రాష్ట్రం హరోహల్లికి చెందిన ఆర్కిడ్ లామినేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి టీ బాలసుదర్శన్రెడ్డి బర్డ్ ట్రస్ట్‌కు రూ.70,07,700 విరాళం ఇచ్చారు. బుధవారం విరాళం డీడీని టీటీడీ పరిపాలన భ వనంలో ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఏడు కొండలకు సూచికగా ఈ విరాళాన్ని అందించినట్టు దాత బాల సుదర్శన్‌రెడ్డి తెలిపారు.