తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల రద్దీ పెరిగింది . కొండ పై అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా రాంభగీచ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. వీరికి శ్రీవారి దర్శనం 24 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా నిన్న స్వామివారిని 64,292 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 30,641 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.72 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.