కృష్ణా నుంచి సంద్రంలోకి 1,648 టీఎంసీలు
ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఏకంగా 1,648 టీఎంసీల జలాలు సముద్రానికి తరలిపోయాయి.
- గత మూడున్నర దశాబ్దాల్లో ఇదే అత్యధికం
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఏకంగా 1,648 టీఎంసీల జలాలు సముద్రానికి తరలిపోయాయి. గత మూడున్నర దశాబ్దాల్లో ఇదే అత్యధికం. కృష్ణా నుంచి 1990-91లో 1,250.19 టీఎంసీలు, 1994-95లో 1,329.30 టీఎంసీలు, 1998-99లో 1,226.50 టీఎంసీలు, 2005-06లో 1,249.49 టీఎంసీలు, 2020-21లో 1,278.12 టీఎంసీలు, 2022-23లో 1,331.55 టీఎంసీలు సముద్రంలో కలిశాయి.
ఈ ఏడాది ఆ రికార్డు బద్దలయింది. వాస్తవానికి అక్టోబర్ మొదటి వారం నాటికే కృష్ణా నుంచి 1,386 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. గత నెల రోజుల వ్యవధిలో మరో 262 టీఎంసీల జలాలు తరలిపోవడంతో మొత్తంగా ఇప్పటివరకు 1,648 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ ఏడాది కృష్ణా నదికి దాదాపు 2 వేల టీఎంసీల వరద వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. కాగా, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, మల్యాల, ముచ్చమర్రి లిఫ్ట్‌ల ద్వారా ఏపీ ఇప్పటికే 240 టీఎంసీలకుపైగా జలాలను తరలించుకుపోయింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

