తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన ఏడుకొండల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 15 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. నిన్న స్వామివారిని 56,225 మంది భక్తులు దర్శించుకోగా 19,588 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.95 కోట్లు ఆదాయం (Income) వచ్చిందని వివరించారు.
శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు
తిరుమల (Triumala) వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు గురువారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టిని నిర్వహించారు.
,