అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ( YCP ) ఎమ్మెల్సీ అనంతబాబు ( MLC Anantha Babu )కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ ( Remand ) విధించింది. ఈ హత్య కేసులో సాక్షులను బెదిరించాలరన్న ఫిర్యాదుపై అతడిని, అతని భార్య లక్ష్మీదుర్గను పోలీసులు అరెస్టు చేశారు.
సాక్షులుగా ఉన్న పలువురిని బెదిరించడం, డబ్బు ప్రలోభాలకు గురిచేయడంతో ఈనెల 20న ఎమ్మెల్సీపై కాకినాడలోని సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. హత్య కేసులో బెయిల్ పిటిషన్ కోసం శుక్రవారం రాజ మహేంద్రవరం కోర్టుకు వచ్చిన దంపతులను సర్పవరం పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరించారు. శనివారం అనంతబాబుకు మొబైల్ కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని ,అతడినిరాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు.