నెల్లూరు : శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం సృష్టించింది. ఇద్దరు వైద్యులతో సహా 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గత నెల 27వ తేదీ నుంచి వరసగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.