తిరుమల : తిరుమలలో (Tirumala) వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. నిన్నస్వామివారిని 63,598 మంది భక్తులు దర్శించుకోగా 20,102 మంది తలనీలాలు( Tonsures) సమర్పించుకున్నారు. స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి( Hundi kanukalu) రూ. 3.59 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
జనవరి 10 నుంచి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనం
ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకూ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి టికెట్ల జారీ షెడ్యూల్ను టీటీడీ విడుదల చేసింది. టీటీడీ ఈఓ జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య, వివిధ విభాగాల అధిపతులతో సమీక్షించారు.
ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి పది రోజుల పాటు భక్తుల దర్శన టికెట్లను ఈ నెల 23 ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది. 10 రోజుల ఎస్ఈడీ టోకెన్లను 24 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.