అమరావతి : తిరుమలలోని శ్రీవారి సర్వ దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 73,371 మంది దర్శించుకోగా, 39,924 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చిందని వివరించారు.
టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తుడ ఛైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.