ఎల్లో మెలన్..లాభాలు అదిరెన్!
మొన్న ఎర్రటి బెండకాయ. నిన్న గులాబీ వర్ణంలో మెరిసిన టమాట. ఇప్పుడు.. పసుపు రంగులద్దుకున్న పుచ్చకాయ. కాయగూరలు, పండ్లు కొత్తకొత్త వర్ణాల్లో సరికొత్తగా
పండుతున్నాయి. మెరుగైన రుచి, ఎక్కువ పోషకాలతో వినియోగదారుల మన్ననలు పొందుతున్నాయి. అన్నదాతకు అధిక లాభాలను ఆర్జించి పెడుతున్నాయి.
వేసవిలో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పుచ్చకాయ సహజంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే, ఇప్పుడు పసుపు రంగులోనూ పండుతూ, మరిన్ని పోషకాలను అందిస్తున్నది. థాయిలాండ్‌లో పదేండ్ల క్రితం సాగైన ఈ వెరైటీ.. మన దేశంలో మొదటగా కర్ణాటకలో సాగైంది. ‘సరయూ’ రకం పేరుతో పలు విత్తన కంపెనీలు మార్కెట్లోకి తీసుకురాగా, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో పలువురు రైతులు ప్రయోగాత్మకంగా పండించారు.
భారీ డిమాండ్..
ఎల్కతుర్తికి చెందిన మహిళా రైతు కనకమ్మ 30 గుంటల్లో సరయూ రకం పుచ్చకాయ సాగుచేశారు. 60 నుంచి 70 రోజులు పంట కాలం కాగా, ఇటీవలే కోతకు వచ్చింది. ఒక్కో కాయ రెండు నుంచి ఐదు కిలోల వరకూ పెరిగింది. 30 గుంటల్లో 6 టన్నుల వరకూ దిగుబడి వచ్చింది. కొత్తరకం కావడంతో మార్కెట్లోనూ దీనికి భారీ డిమాండ్ ఉన్నది. అయితే, ఈసారి ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడి కాస్త తగ్గిందని, వాతావరణం అనుకూలిస్తే, దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉన్నదని రైతులు చెబుతున్నారు. ఎండకాలంలోనే కాకుండా అన్ని రుతువుల్లోనూ పండించేందుకూ పసుపుపచ్చ పుచ్చకాయలు అనువుగా ఉంటాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు.
తోట వద్దే కొనుగోళ్లు..
హైదరాబాద్‌తోపాటు ప్రధాన నగరాల్లో ఈ ఎల్లో వాటర్ మెలన్ రకానికి మంచి ధర పలికింది. రాజధానికి చెందిన వ్యాపారులు తోటల వద్దకే వచ్చి టోకుగా కొనుగోలు చేస్తున్నారు. మండలంలో సాగు చేసిన రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల వద్దే టన్నుకు రూ.15 వేల చొప్పున వ్యాపారులకు విక్రయించారు. ఇంకొందరు హైదరాబాద్‌లో పెద్ద పెద్ద మాల్స్‌కు రవాణా చేసి, టన్నుకు రూ.20 వేల వరకు ఆర్జించారు.

మంచిగనే ఉంది..
అన్ని పంటలూ ఎయ్యాలెనని సీఎం కేసీఆర్ చెప్పినట్లే చేస్తున్నం. ఈసారి మక్కజొన్న, కూరగాయలతోపాటు కొత్తరకం పుచ్చకాయ సాగు చేసినం. మాకు దిగుబడి కూడా బాగచ్చింది. పసుపు రంగులో ఉండే ఈ కాయలకు మంచి డిమాండ్ ఉన్నది. అందరూ మా చేను కాడికి వచ్చి, ఈ కాయలను కొనుక్కొని పోతాండ్లు. ధర కూడా మంచిగ పలికింది.
కొన్నె కనకమ్మ,మహిళా రైతు, ఎల్కతుర్తి ప్రయత్నం మంచిదే..
ప్రపంచవ్యాప్తంగా 1200 రకాల పుచ్చకాయ రకాలు ఉన్నాయి. థాయిలాండ్‌కు చెందిన పసుపు రంగు పుచ్చకాయలను స్థానికంగా సాగు చేయడం మంచిదే. రైతులు మూస పద్ధతిలో కాకుండా భిన్నమైన మార్గంలో పయనించడం శుభ పరిణామం. ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యంలోకి వచ్చిన పసుపు పచ్చ పుచ్చకాయలో మంచి పోషకాలు ఉన్నాయి. 14 శాతం తీపి ఉండే ఈ రకాలు ఎక్కువ రుచిగా ఉంటాయి.
–అనంతరెడ్డి, ఉద్యాన అధికారి, నల్లగొండ
-పిన్నింటి గోపాల్
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

