Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
Radhika | దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ఇంట్లో పనిచేసే మహిళ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె వద్ద పనిచేస్తున్న సహాయకురాలి 19 ఏళ్ల కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులే అతడిని హత్య చేసి, మృతదేహాన్ని సముద్ర తీరంలోని ఇసుకలో పాతిపెట్టడం తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది.
Radhika | దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ఇంట్లో పనిచేసే మహిళ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె వద్ద పనిచేస్తున్న సహాయకురాలి 19 ఏళ్ల కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులే అతడిని హత్య చేసి, మృతదేహాన్ని సముద్ర తీరంలోని ఇసుకలో పాతిపెట్టడం తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. యువకుడి అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని బన్రుట్టి ప్రాంతానికి చెందిన ఎళిల్సెల్వి చెన్నైలో నటి రాధికా శరత్‌కుమార్ ఇంట్లో సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు ప్రశాంత్ (19) స్వగ్రామంలో ఉంటూ తన మేనమామ రమేష్‌తో కలిసి భవన నిర్మాణ రంగంలో టైల్స్ వేసే పనులు చేసేవాడు. ఈ నెల 27న చెన్నైలో ఉంటున్న తల్లిని కలిసేందుకు ప్రశాంత్ బయలుదేరాడు. అయితే ఆ తర్వాత అతడి ఆచూకీ లభించలేదు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడంతో పుదుప్పేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ప్రశాంత్ అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అతడి ఫోన్ కాల్ వివరాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా బన్రుట్టికి చెందిన దేవరాజు, దినేష్ అనే ఇద్దరు వ్యక్తులు చివరిగా ప్రశాంత్‌తో మాట్లాడినట్లు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.ఈ విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ప్రశాంత్‌కు స్నేహితులైన దేవరాజు, దినేష్ అతడిని పొన్నేరి బీచ్ సమీపానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని సముద్రతీరంలోని ఇసుకలో పాతిపెట్టినట్లు నిందితులు చెప్పినట్లు సమాచారం.నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు బీచ్ ప్రాంతానికి చేరుకుని గురువారం మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు ఈ హత్యకు కారణం ఏమిటి? స్నేహితుల మధ్య ఏదైనా వివాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- domestic help
- murder
- radhika
- Son
RELATED ARTICLES
తాజా వార్తలు
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

