KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
KTR | ఐడీబీఐ బ్యాంకు విలువను తక్కువగా అంచనా వేస్తున్నారన్న నివేదికలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్రానికి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు.
KTR | ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు), ప్రభుత్వ రంగ బ్యాంకులు పరిరక్షించాల్సిన జాతీయ ఆస్తులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ నిలిపేయాలన్న తమ విజ్ఞప్తికి, ఆందోళనకు మద్దతు తెలపాలని ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ.. తనకు ట్యాగ్ చేసిన అంశంపై కేటీఆర్ స్పందించారు.
ఐడీబీఐ బ్యాంకు విలువను తక్కువగా అంచనా వేస్తున్నారన్న నివేదికలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్రానికి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. బిడ్లు రిజర్వ్ ధర కంటే తక్కువకు పడిపోయినప్పుడు, నిబంధనలను, విలువ నిర్దారణ పద్దతిని ఎందుకు మార్చారన్నారు.
ఐడీబీఐకి హైదరాబాద్‌లోని ప్రధాన భూమితో సహా విలువైన స్థిరాస్తి ఆస్తులు కూడా ఉన్నాయి. మరి వాటి విలువను సరిగ్గా లెక్కించారా..? ఐడీబీఐ ఉద్యోగులు లేవలెత్తిన ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? ఒక ప్రతిష్మాత్మక ప్రభుత్వ రంగ బ్యాంకును ప్రైవేట్ సంస్థలకు అమ్మే ముందు, కేంద్ర ప్రభుత్వం దేశానికి కొన్ని సూటి సమాధానాలు ఇవ్వాలి.. ఎందుకంత తొందర..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
దేశానికి పేరున్న ప్రభుత్వ రంగ బ్యాంకును ప్రైవేట్ సంస్థకు అప్పగించే ముందు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థల విలువ, భవిష్యత్తు విషయంలో పారదర్శకత ఎందుకు పాటించడం లేదు..? అని కేంద్రాన్ని అడిగారు.
PSUs and Public Sector Banks are national assets that need to be safeguarded
Reports about under valuation of IDBI bank are really concerning. Why were the rules and valuation methodology changed when bids fell below the reserve price?
IDBI also owns valuable real estate assets, including prime land in Hyderabad. Has their value been properly accounted for?
Why are the concerns raised by the IDBI employees not being addressed?
Before selling off a reputed public sector bank to a private player, the union government owes the country some straight answers
What’s the hurry ?
— KTR (@KTRBRS) October 31, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

