Organic fertilizers | ఇంటి మొక్కలకు సేంద్రీయ ఎరువులే ముఖ్యం..!
Organic fertilizers | ఇంట్లోని చెత్తను.. వంటింట్లోని కూరగాయల ముక్కలను తీసి పారేయకండి. ఇవే సేంద్రీయ ఎరువుగా మారి మన ఇంట్లో మొక్కలకు జీవాన్నిస్తాయి. ఇలా తయారుచేసుకునే సేంద్రీయ ఎరువులతో...
Organic fertilizers | ఇంట్లోని చెత్తను.. వంటింట్లోని కూరగాయల ముక్కలను తీసి పారేయకండి. ఇవే సేంద్రీయ ఎరువుగా మారి మన ఇంట్లో మొక్కలకు జీవాన్నిస్తాయి. ఇలా తయారుచేసుకునే సేంద్రీయ ఎరువులతో ఇంటి వెనకాల, మిద్దెపై పండించే పంటలకు, మొక్కలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఇలాంటి ఎరువు వేయటం వల్ల ఇంటి వద్ద పెంచుకొనే కూరగాయ మొక్కలు కూరలు ఆరోగ్యకరంగానే కాదు రుచిగా కూడా ఉంటాయి.
ఆకు ఎరువును ఎవరైనా చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. వంటింట్లో పనికిరాని కూరగాయలు, పండ్ల తొక్కలు, రాలిన ఆకులతో స్వయంగా ఇంటి వద్దనే తయారుచేసుకోవచ్చు. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవే కాకుండా మనకు సురక్షితమైనవిగా చెప్పుకోవచ్చు.
పొడి ఎరువులు
మంట్టిలో కలిపి వీటిని గార్డెన్లు, కంటైనర్లలో పెంచే మొక్కలకు వాడొచ్చు. వీటిని సాధారణంగా నారు, మార్పిడి, పంటల దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించేలా దోహదపడతాయి.
తడి ఎరువులు
మొక్క చుట్టూ ఉన్న మట్టిపై పోయొచ్చు. ఆకులపై పిచికారి కూడా చేయొచ్చు. ద్రవ ఎరువులు సాధారణంగా చురుగ్గా పెరిగే మొక్కలకు మరింత ప్రయోజనం అందిస్తాయి. దీనిని నెలవారీగా అప్లై చేయాలి.
మొక్కల ఆధారిత ఎరువులు
ఇవి సాధారణ ఎరువుల కంటే మట్టి కండీషనింగ్ మార్గంలో ఎక్కువగా అందిస్తాయి. అల్ఫాల్ఫా మీల్ లేదా కంపోస్ట్ వవంటి ఈ పదార్థాలు డ్రైనేజీ, తేమ నిలుపుదలకు దోహదపడతాయి.
జంతు ఆధారిత ఎరువులు
జంతువుల ఎముకలు లేదా బ్లడ్ మీల్ వంటి జంతు ఆధారిత ఎరువులు మట్టికి చాలా నత్రజనిని జోడిస్తాయి. ఇవి ఆకుకూరల సాగుకు చాలా ఉపయోగపడతాయి.
ఖనిజ ఆధారిత ఎరువులు
ఇవి మట్టిలో పోషకాలను జోడిస్తాయి. ఆరోగ్యకరమైన మొక్కల ఎదుగుదలకు అవసరమైన pH స్థాయిని పెంచడం, తగ్గిచడం చేస్తుంది. కాల్షియం, ఎప్సమ్, ఉప్పు వంటివి కొన్ని ఖనిజ ఆధారిత ఎరువులు.
సేంద్రీయ ఎరువుల జాబితా
అరటి తొక్కలు : ఇవి పొటాషియం కలిగి ఉండి చిన్న మొత్తంలో నైట్రోజన్, ఫాస్పరస్, మెగ్నీషియం అందిస్తాయి. కొత్త మొక్కలను నాటే సమయంలో అరటి తొక్కను చిన్న ముక్కలుగా కత్తిరించి మట్టిలో కలపడం ద్వారా ఎక్కువ పోషకాలను అందివ్వవచ్చు.
కోడిగుడ్డు షెల్స్ : ఇవి మరో గొప్ప సహజ ఎరువు. ఇవి కాల్షియంను కలిగి ఉండి మట్టిలో ఎసిడిటీని తగ్గించేందుకు సహాయపడతాయి. వీటిలో ఉండే ఫాస్పరస్ మొక్కలు ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని క్రష్ చేసి మొక్కల మొదళ్లలో వేసి నీరు పోయాలి.
వంట నీరు : కూరగాయలను ఉడకబెట్టేందుకు ఉపయోగించే నీటిని, ఆవిరి పెట్టిన తర్వాత మిగిలిన నీటిని ఇండోర్ మొక్కలకు ఇవ్వడం ద్వారా ఎక్కువ పోషకాలను అందివ్వవచ్చు.
అక్వేరియం నీరు : ఈ నీటిలో కుళ్లిపోతున్న చేప ఆహారంతో చేపల వ్యర్థాలను మొక్కలకు ఎరువులుగా వాడవచ్చు. దీనిలో ఉండే సహజ నైట్రోజెన్ ఫలదీకరణం చెందించడంలో గ్రేట్‌గా ఉపయోగపడుతుంది.
కాఫీ పొడి : కాఫీ తాగే అలవాటు ఉన్నవారు కాఫీ తయారు చేసిన తర్వాత మిగిలిన కాఫీ పొడి చెత్తను మొక్కలకు వాడటం ద్వారా వాటికి పోషకాలను అందించే వీలుంటుంది. కాఫీ పొడి మట్టిని ఆమ్లంగా తయారుచేసి ఏపుగా పెరిగేందుకు దోహదపడుతుంది.
వీటితో పాటు తృణధాన్యాల ముక్కలు, చెక్క పొడి, పత్తిగింజల పొడి, రాక్ ఫాస్పేట్, ఆవు పేడ, కంపోస్ట్, గడ్డి క్లిప్పింగ్స్ వంటి వాటిని కూడా మొక్కలకు ఎరువులుగా వాడుకోవచ్చు.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

