Onion Peels | ఉల్లిగడ్డ పొట్టుతో సేంద్రియ ఎరువు తయారీ ఎలా?
Onion Peels | ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అనే సామెత అందరికీ తెలిసిందే. అదే కాదు.. ఈ ఉల్లిగడ్డ పొట్టుతో ఇంట్లోనే సేంద్రీయ ఎరువును కూడా తయారు చేయొచ్చు. ఉల్లిని తరిగిన తర్వాత ఆ పొట్టును చెత్తడబ్బాలో పడేయకుండా.. జీరో

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అనే సామెత అందరికీ తెలిసిందే. అదే కాదు.. ఈ ఉల్లిగడ్డ పొట్టుతో ఇంట్లోనే సేంద్రీయ ఎరువును కూడా తయారు చేయొచ్చు. ఉల్లిని తరిగిన తర్వాత ఆ పొట్టును చెత్తడబ్బాలో పడేయకుండా.. జీరో బడ్జెట్‌తో ఎరువును తయారు చేయొచ్చు. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలు ఉల్లిగడ్డ పొట్టులో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పొట్టును సేంద్రీయ ఎరువుగా మార్చి మొక్కలకు చల్లితే అవి ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇక మార్కెట్లలో వేల రూపాయాలు ఖర్చు పెట్టి ఎరువులను కొనాల్సిన అవసరం లేదు.
ఆర్గానిక్ ఎరువు తయారీ ఇలా..
- మొదట ఉల్లిగడ్డ పొట్టును ఓ మోతాదులో సేకరించాలి.
- ఆ తర్వాత ఓ పాత్రలో తీసుకున్న లీటర్ వాటర్‌లో ఉల్లిపొట్టును వేయాలి.
- 24 గంటల పాటు ఆ పాత్రను కవర్‌తో కప్పి ఉంచాలి.
- అనంతరం ఆ పాత్రలో ఉన్న మిశ్రమాన్ని వడకట్టి.. నేరుగా మొక్కలకు ఉపయోగించాలి.
ఊదా రంగులో ఉన్న ద్రావణాన్ని మొక్కలకు పోయడం వల్ల పుష్కలంగా పొటాషియం లభిస్తుంది. ఈ ద్రావణాన్ని పెరడులోని మొక్కలతో పాటు ఇతర మొక్కలకు కూడా ఉపయోగించొచ్చు. ఇలా నెలలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే మొక్కలు ఎలాంటి వ్యాధులకు గురికావు.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

