Fish farming | మనం సాధారణంగా పూలమొక్కలు, కూరగాయలను.. కోళ్లు, కుందెళ్లను పెంచుకుంటుంటాం. మరికొందరు బాతులు, గొర్రెలు, మేకలను పెంచుతారు. వీటితో పాటు చేపలను కూడా పెంచుకోవచ్చు అని సెలవిస్తున్నారు పశు వైద్య నిపుణులు. షోకేజ్ కోసం అక్వేరియంలో పెంచుకోకుండా పెద్దసంఖ్యలో చేపలను పెంచి మంచి ఆదాయం కూడా పొందవచ్చు.
చేపల పెంపకం ద్వారా ఇంటి పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు వాటిని చూస్తూ సేదతీరొచ్చు. చేపల పెంపకంలో కొన్ని యాజమాన్య పద్ధతులను చేపట్టడం ద్వారా మంచి దిగుబడులను పొందవచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేందుకు రకరకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి.