హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ) : ప్రముఖ ఆటోమొబైల్ డీలరైన వివిసీ గ్రూప్ ఇబ్రహీంపట్నంలోని మన్నెగూడ ఆర్టీవో ఆఫీస్‌కు సమీపంలో నూతన టాటా షోరూమ్‌ను ప్రారంభించింది. దాదాపు 10వేల స్క్వేర్‌ఫీట్ గల అతి విశాలవంతమైన షోరూమ్‌ను, సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. వివిసి గ్రూప్ అఫ్ కంపనీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వివి రాజేంద్రప్రసాద్, టాటా మోటార్స్ జోనల్ మేనేజర్ సేల్స్ జయ్‌దీప్ గుప్తె, రీజనల్ మేనేజర్ గోపి, రీజినల్ కస్టమర్ కేర్ మేనేజర్ దీపక్ అగర్వాల్‌లు కలిసి నూతన టాటా షోరూమ్, సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వివి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. మా వివిసి మోటార్స్ నుంచి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో అత్యంత విశాలవంతమైన షోరూమ్‌ను అలాగే అధునాతన సెర్వీస్ సెంటర్‌ను స్టార్ట్ చేయడం సంతోషంగా ఉందదన్నారు. వివిసి మోటార్స్ నుంచి ఇది 25వ అవుట్ లెట్ అని అలాగే ఈ సర్వీస్ సెంటర్‌తో కలిపి 18 సర్వీస్ సెంటర్లను తెలంగాణలో నడుపుతున్నామని, టాటా కార్ కొనే ప్రతీ కస్టమర్‌కి సర్వీస్‌లో ఏమాత్రం ఇబ్బంది ఉండకుండా అత్యుత్తమ సర్వీస్‌ని అందించేలా అధునాతన టెక్నాలజీతో విశాలవంతంగా ఇక్కడ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించామని మీడియాకు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జోనల్ నెట్వర్క్ మేనేజర్ రామ్ మోహన్, టెరిటరీ సేల్స్ మేనేజర్ దీపక్, డీలర్ ప్రిన్సిపల్స్ వీరేన్ చౌదరి, విక్రమ్ ఆదిత్యలు, షోరూమ్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో టాటా వారి సరికొత్త ఆల్ట్రోస్ కారును మార్కెట్లోకి విడుదల చేశారు.