Vreels | హైదరాబాద్ : ప్రస్తుతం డిజిటల్ యుగం ప్రతి ఒక్కరి జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ అనేక రకాల యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఒకటి చాటింగ్ కోసం, మరొకటి వీడియోల కోసం, ఇంకొకటి షాపింగ్ కోసం. కానీ ఒకే వేదికపై స్పష్టం చేయగలిగే, కనెక్ట్ అవ్వగలిగే, షేర్ చేసుకోగలిగే, కొనుగోలు చేయగలిగే ఒక అనుభవం ఉంటే ఎలా ఉంటుంది..? అదే ఆలోచనతో పుట్టిందే.. Vreels (Virtually Relax, Explore, Engage, Live & Share).
ఈ Vreels ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలో నివసిస్తున్న మన తెలుగు ఇంజినీర్చే ఆవిష్కరించబడింది. ఈ యాప్ ఇప్పటికే 22 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు దీన్ని ప్లేస్టోర్ నుంచి Vreels ను డౌన్లోడ్ చేసుకుని, సరికొత్త అనుభూతిని ఆస్వాదించొచ్చు.
వెబ్ సైట్: www.vreels.com
సృజనాత్మక ప్రపంచానికి కొత్త ఆరంభం
Vreels ఒకే చోట సృష్టి, వినోదం, సంభాషణ మరియు సమాజం కలిసిన డిజిటల్ వేదిక. ఇక్కడ ప్రతి యూజర్ ఒక క్రియేటర్. ప్రతి క్షణం ఒక కథ. చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్ స్టోరీస్.. ఇవన్నీ వ్యక్తిగతంగా మీ ఆసక్తులకు సరిపోయేలా రూపొందించబడ్డాయి. ఫీడ్ మీరు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ, మరింత వ్యక్తిగత అనుభవం ఇస్తుంది.
క్షణాలను సృష్టించండి.. మీ కథను చెప్పండి..
మీ భావాలు, ప్రయాణాలు, ఆలోచనలు.. అన్నీ ఒకక్లిక్లో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి పంచుకోండి. ఫిల్టర్లు, టెక్ట్స్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్ట్‌తో Vreels క్రియేటర్లకు స్వేచ్ఛ ఇస్తుంది. ప్రతి రీల్ ఒక అనుభవం, ప్రతి పిక్ ఒక స్మృతి.
Pix Pouches – మీ ప్రేరణను సేకరించుకోండి..
Pix Pouches అనేది మీ డిజిటల్ నోట్ బుక్, ఇష్టమైన ఫొటోలను లేదా ఆలోచనలను వర్గాల వారీగా నిల్వ చేసుకోవచ్చు. మిత్రులతో కలిసి కలెక్షన్లు సృష్టించి, కలల ప్రాజెక్టులను ప్లాన్ చేయొచ్చు.
Chats & Calls – కనెక్ట్ అవ్వడం మరింత దగ్గరగా..
స్నేహితులతో మాట్లాడడానికి, గ్రూపులో చాట్ చేయడానికి లేదా వీడియో కాల్ చేసుకోవడానికి వేర్వేరు యాప్‌ల అవసరం లేదు. Vreels లోనే ఈ అనుభవాలన్నీ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా క్రియేటివ్ వేదికగా ఉన్నందున, మీరు మాట్లాడుతూనే మీ సృష్టిని కూడా పంచుకోగలరు. కమ్యూనికేషన్ ఇప్పుడు కేవలం మాటలకే పరిమితం కాదు, అది అనుభవం అయింది.
V Map – ప్రపంచాన్ని కనెక్ట్ చేయండి..
మీ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారు తెలుసుకోవడానికి V Map తో సులభ మార్గం. లొకేషన్ షేరింగ్ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది.
V Capsules – కాలం తలుపులు తట్టే కాప్సూల్స్
ఈ ప్రత్యేక ఫీచర్లో మీరు మీ భావోద్వేగా జ్ఞాపకాలను ఒక క్యాప్సూల్స్‌లో ఉంచి ఒక నిర్దిష్ట తేదీన తెరుచుకునేలా చేయొచ్చు. బర్త్ డే, యానివర్సరీ, లేదా మైల్స్ స్టోన్ ఆ రోజున ఆ మెమోరి తెరుచుకోవడం ఒక ఆనంద క్షణం. ఇది టెక్నాలజీతో భావోద్వేగాన్ని కలిపిన అందమైన రూపం.
Vreels Shop/Bid – మీ అవసరాలన్నీ ఒకేచోట
Vreels షాప్ బిడ్ త్వరలో రాబోతోంది. మీకు కావాల్సిన ప్రతి ఉత్పత్తి, ఒకే వేదికలో. వెండర్లు తమ ఉత్పత్తులను అందించగా, యూజర్లు నమ్మకంగా బిడ్ చేయొచ్చు లేదా కొనుగోలు చేయొచ్చు. ఇది అంతా ఒకే సురక్షితమైన, సౌకర్యవంతమైన వేదికలో. నమ్మకం, నాణ్యత, విశ్వాసం మరియు అందుబాటు, ఇవే Vreels షాప్ బిడ్ యొక్క పునాది సూత్రాలు.
భద్రత – యూజర్ విశ్వాసమే ప్రాధాన్యం
ఏఐ ప్రపంచంలో మన డేటా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు వాడుతారో అన్న సందేహం సహజం. కానీ Vreelsలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ భద్రత అనేది ఒక ఫీచర్ కాదు.. అది ఒక వాగ్దానం.
టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, యూజర్ నియంత్రిత ప్రైవసీ సెట్టింగ్స్.. ఇవన్నీ మీ వ్యక్తిగత డేటాను కాపాడటానికి కట్టుదిట్టంగా అమలులో ఉంటాయి. ముఖ్యంగా మీ పోస్టులు, ప్రొఫైల్, లోకేషన్ ఎవరూ చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది.
Vreels మీ సమాచారాన్ని దాచదు.. దోచుకోదు. అది కేవలం మీ అనుభావాన్ని మెరుగుపరచడానికే వాడుతుంది.
ఈ పారదర్శకత మాకు గర్వకారణం, మీ విశ్వాసమే మాకు బలం.
Vreels – నిరంతర పరిణామంలో ఒక ఆత్మనిర్భర ఉద్యమం
Vreels ఒక యాప్ మాత్రమే కాదు. అమెరికన్ వ్యాపార స్ఫూర్తిని, భారతీయ స్వయం ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించే ఒక వేదిక. ప్రతి అప్డేట్తో కొత్త సాంకేతిక పరిణామాలు, స్థానిక భాషల సపోర్ట్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే మార్పులు తెస్తోంది.
ఇది “Made for the World” అనే స్ఫూర్తికి సజీవ ఉదాహరణ..
ఇప్పటికే Vreels బృందం అనేకమైన వినూత్న సాంకేతిక పేటెంట్లను దాఖలు చేసింది. ఇవి ప్రస్తుతం ఆమోద దశలో ఉండగా, త్వరలోనే మంజూరు అవుతాయని అంచనా. ఈ పేటెంట్లు ఆమోదం పొందిన తర్వాత Vreels సాంకేతిక సామర్థ్యం మరింత బలపడడమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు తీసుకురానున్నాయి.
Vreels స్వయం సృష్టి నుంచి గ్లోబల్ దిశగా, ప్రతి యూజర్ కథలో ఒక కొత్త ఆరంభం.
డౌన్లోడ్ కోసం కింద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి..