జన్నారం, డిసెంబర్ 31 : మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఆదర్శ కళావేదిక అధ్యక్షుడు లింగంపెల్లి రాజలింగం ఆధ్వర్యంలో రూపొందిస్తున్న ‘ఆటోవాలా కన్నీటి గాథ’ షార్ట్ ఫిల్మ్‌తో పాటు పాటల చిత్రీకరణను జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ ఆదివారం క్లాప్ కొట్టి ప్రారంభించారు.
ఆదర్శ క్రియేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆటో కార్మికు లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూపిస్తామని నిర్మాత రాజలింగం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్‌కుమార్, డైరెక్టర్ సులువ జనార్దన్, మైక్ సతీశ్, రమేశ్, సాయిరాజ్, నాయకులు పాల్గొన్నారు.