రెబ్బెన, అక్టోబర్ 31 : మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే అభ్యర్థిపై హత్యాయత్నం అనేది కాంగ్రెస్ నీచపు రాజకీయానికి నిదర్శనమన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి పద్ధతి సరైం ది కాదన్నారు. సమావేశంలో జడ్పీటీసీ వేముర్ల సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, రైతుబంధు సమితి జిల్లా సభ్యురాలు కుందారపు శంకరమ్మ, ఎంపీటీసీ పెసరి మధునయ్య, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు చెన్న సోమశేఖర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు మహేశ్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ పర్లపల్లి వనజ, కోఆప్షన్మెంబర్ జౌరొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు వినోద్‌జైస్వాల్, అజయ్జైస్వాల్, బొమ్మినేని శ్రీధర్, పందిర్ల మధునయ్య, తనుకు మురళీ, పర్వతీఅశోక్, ప్రతాప్ తదితరులున్నారు.