బోథ్, మే 16 : సొనాల మండలానికి కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితా కేటాయింపులో జాప్యం చేస్తున్న కమిటీ సభ్యులను వెంటనే తొలగించాలని యువ శక్తి యూత్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులే పూర్తి స్థాయి జాబితా తయారు చేసి అర్హులకు న్యాయం చేయాలని కోరారు.
ఇప్పటికే పలు మార్లు జాబితాలో పేర్లు మారాయని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు ఎవరికి ఇష్టం వచ్చిన వారి పేర్లు జాబితాలో ఎక్కిస్తున్నారని ఆరోపించారు. సొనాలలోని ఇందిరమ్మ కమిటీ రద్దు చేయాలని, అర్హులకే ఇండ్లు కేటాయించాలని కోరారు.