ఉట్నూర్, జనవరి 18 : ఏజెన్సీ రైతులకు పాడి పరిశ్రమ ద్వారా మరింత ఆదాయం అందించేం దుకు కృషి చేస్తున్నామని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. స్థానిక కుమ్రంభీం ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో బుధవారం రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధ్ది సహకార సమాఖ్య, ఐటీడీఏ సహకారంతో పాలమిత్రలకు ఎలక్ట్రానిక్ మిల్కోటెస్టర్ వినియోగంపై జరిగిన శిక్షణ కార్యక్ర మానికి హాజరై మాట్లాడారు. గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పాడి పరిశ్రమ ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు.
ప్రయోగాత్మకంగా 30 గ్రామా లను ఎంపిక చేసి గిరిజనులకు పాడి పశువుల కొనుగోలుకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. త్వరలోనే ఉట్నూర్లో పాల శీతల కేంద్రం ప్రారం భం కానున్న దృష్ట్యా ఉట్నూర్ పరిసరాల చుట్టూ 20 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పాల నాణ్యతా పరీక్షలపై రూ.8 లక్షల విలువ గల 20 మల్కో టెస్టర్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపా రు. ప్రతి గ్రామంలో కనీసం 300 లీటర్ల సేకరణ లక్ష్యంగా పనిచేయనున్నట్లు చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో విజ్ఞాన యాత్రలు నిర్వహించి పాల సేకరణను పెంచేలా పాలమిత్రలను ప్రోత్సహిస్తా మని పేర్కొన్నారు. దాణా, పాల ఉత్పత్తి, వెన్న శాతం పెంచడం తదితర అంశాలపై శిక్షణ ఇస్తామ ని తెలిపారు. విజయ డెయిరీ డీడీ మధుసూదన్, జేడీఎం నాగభూషణ్, మేనేజర్ దుస్రు, రమణా రెడ్డి, అనిల్, రవి, రమేశ్ పాల్గొన్నారు.