హాజీపూర్, జనవరి 22 : మండలంలోని బుగ్గట్టు ప్రాంతంలోని ఇటుకబట్టీల్లో వర్క్ సైట్ పాఠశాలను సోమవారం ఆపరేషన్ ముష్కాన్ ఎస్ఐ విజయ్‌కుమార్, ఎంఈవో పోచయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా ఈ పాఠశాలను ప్రారంభించామన్నారు.
ఇటుకబట్టీల్లో పని చేసేందుకు వచ్చిన వారి కుటుంబాల్లో 50 మంది బడీడు పిల్లల్ని గుర్తించామని, వారి భాషలోనే బోధించేందుకు ట్యూటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారి ఇందిర, సెక్టోరియల్ అధికారులు చౌదరి, మూర్తి, ఇటుకబట్టీల నిర్వాహకులు పాల్గొన్నారు.