మంచిర్యాల అర్బన్, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లో రాణించి, ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రముఖ జనరల్ సర్జన్ డా.కళావతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నారాయణ జనరల్ అండ్ సర్జికల్ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిద్దాలని పేర్కొన్నారు.
అనంతరం హాస్పిటల్ డైరెక్టర్ యోహన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మొ ట్టమొదటి మహిళా జనరల్ సర్జన్ ఇక్కడ సేవ లు అందించడం సంతోషంగా ఉందని, మహిళలందరూ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. దాదాపు 200 మందికిపైగా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించినట్లు వెల్లడించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ప్రము ఖ విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, కాలనీవాసులు, సిబ్బంది ఉన్నారు.