నార్నూర్ : మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Shah) అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో పర్యటించారు. బుద్ధ విహార్‌లో ఏర్పాటుచేసిన బాంబు క్రాఫ్ట్ ( Bambu Craft ) తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక మండల ప్రజా పరిషత్ పాఠశాలలు, స్వ స్వస్దన్ ట్రస్ట్‌ను సందర్శించారు.
పాఠశాలలో భవిత కేంద్రాన్ని ప్రారంభించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి ఆంగ్లంలో చదవడం, రాయడం వచ్చేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రజలకు వైద్యం అందిస్తున్న తీరును వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
నార్నూర్ అభివృద్ధికి కృషి చేయాలని పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్, సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్ వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం గుండాల గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. జడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీఎంహెచ్ వో రాథోడ్ నరేందర్, తహసీల్దార్ జాడి రాజలింగం, ఎంపీడీవో రాథోడ్ గంగా సింగ్, డీఈలు శ్రీనివాస్, జాడి లింగన్న, స్థానిక నాయకులు ఉన్నారు.