కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతాంగం అవస్థలు పడుతున్నది. ఇప్పటికే పంట చేతికిరాగా ఇండ్లు.. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసుకొని అమ్ముకునేందుకు నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది.
59,212 ఎకరాల్లో సాగు
ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 59,212 ఎకరాల్లో వరి సాగయ్యింది. సుమారు 57 వేల మెట్రిక్ ట న్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచ నా వేస్తున్నారు. ఈ ఏడాది 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్కచోట కూడా కొనుగోళ్లు ప్రారంభించలే దు. పలుమార్లు సమీక్షలు నిర్వహించినప్పటి కీ ఫలితం లేకుండా పోతున్నది. ప్రధానంగా దహెగాం, చింతలమానేపల్లి, కాగజ్‌నగర్, కౌ టాల, సిర్పూర్, పెంచికల్పేట్ మండలాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమై పక్షం రో జులు కావస్తున్నది. రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి ఇండ్లు, కొనుగోలు కేంద్రాల్లో పోసుకొ ని ఎదురుచూస్తున్నారు. వర్షం వస్తే త మ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
సన్నరకానికి బోనస్‌పై సందేహాలు
ఇక సన్నరకం వరిధాన్యానికి ప్రభుత్వం ఇచ్చే రూ. 500 బోనస్‌పై రైతుల్లో సందేహం మొదలైంది. ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బోనస్ ఇస్తారా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయని అధికారులు.. ఇక సన్నవడ్ల సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏ-గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ. 2,320, సాధారణ రకానికి 2,300 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అలసత్వం కారణంగా రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితిపరిస్థితి దాపురిస్తున్నది.