నార్నూర్, డిసెంబర్ 24 : వనవాసీ కల్యాణ్ పరిషత్, నగరవాసి వనయాత్ర కార్యక్రమంలో భాగంగా రోటరీ గ్లోబల్ చాంపియన్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో గాదిగూడ మండలం కుండీ, ఖడోడి, బొజ్జుగూడలోని కొలాం గిరిజనులకు శనివారం చక్రాల నీటి బిందెలను పంపిణీ చేశారు. వీటిని చూసి కొలాం గిరిజ నం మురిసిపోయింది.
మహిళలు, పురుషులు నీటిని తెచ్చుకునేటప్పుడు ఇబ్బంది కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతో సులభంగా చేతితో లాగుతూ తీసుకెళ్లేలా మొత్తం 140 చక్రాల నీటి బిందెలను కొలాంలకు అందించినట్లు రోటరీ గ్లోబల్ చాంపియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎన్ మేధా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఉయికే భీంబాయి, టేకాం అయ్యూ, ఉప సర్పంచ్ జంగుబాయి, రోటరీ గ్లోబల్ సభ్యులు ఎస్కే ఉపాధ్యాయ, డీవీ రావ్, రామ్ నారాయణ, వనవాసీ కల్యాణ్ పరిషత్ కార్యకర్తలు మైస శంకర్, అజయ్,ఆత్రం బారిక్రావ్, నాగోరావ్ తదితరులు పాల్గొన్నారు.