ఉట్నూర్ రూరల్ : ఆదిలాబాద్ జిల్లా గాదిగూడా మండలంలోని పిప్పిరి గ్రామంలో నలుగురు , బేల మండలంలోని సొన్నాస్, సాంగ్వీడి గ్రామంలో ఇద్దరు పిడుగు పాటుతో ( Lightning ) మృతి చెందటం దురదృష్టకరమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ( MLA Vedma Bojju Patel ) పేర్కొన్నారు.ఈ సందర్భంగా గాదిగూడ,బేల మండలాల్లో పిడుగు పాటుతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందటం తీవ్రంగా కలిచివేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వర్షాలు కురుస్తున్న సమయంలో రైతులు పంట పొలాలలో వెల్లకూడదని సూచించారు. పిడుగు పాటుతో తీవ్ర గాయాలై రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లను ఆదేశించారు. మృతుల పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.