నేరడిగొండ : గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ (MLA Jadav Anil) హామీ ఇచ్చారు. సోమవారం మండలంలోని నాగమల్యాల గ్రామస్థులు నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు . గ్రామంలో సీసీ రోడ్లు (CC Roads) వేయాలని, మురికి కాలువలను నిర్మించాలని కోరారు.
శివారు ప్రాంతం వరకు విద్యుత్ స్తంభాలు వేయాలని కోరారు.ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామస్థుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమృత్, దేవరావ్, మాజీ ఉపసర్పంచ్ దేవేందర్ రెడ్డి , నాయకులు సుమన్, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.