కుభీర్ : స్వాతంత్ర భారత దేశం కోసం ఎందరో మహనీయుల త్యాగాల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపెల్లి గంగాధర్( Gangadhar ) పిలుపునిచ్చారు. కుబీర్ మండల కేంద్రంలో గురువారం అఖండ భారత్ ( Akhanda Bharat ) కార్యక్రమంలో భాగంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో అన్న బహుసాటే కూడలిలో కాషాయ జెండాను ఎగరవేసి మాట్లాడారు.
ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వతంత్ర భారతావని రూపుదిద్దుకొందని అన్నారు. మహనీయుల ను స్మరించుకొని వారి అడుగు జాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందు వాహిని మండల శాఖ అధ్యక్షుడు నాగభూషణ్, బీజేపీ మండల అధ్యక్షుడు ఏశాల దత్తు, దొంతుల దత్తాత్రి, బోయిడి అభిషేక్, హిందు వాహిని కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.