‘గణ’ వీడ్కోలు
వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, వినాయకుడి ప్రతిష్ఠాపన అనంతరం కొందరు 5 రోజుల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గురువారం కుంకుమపూజ కార్యక్రమాలు నిర్వహించిన మండలి సభ్యులు.. శుక్రవారం అన్నదానం చేపట్టారు.
- నియోజకవర్గంలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం
- అలరించిన డీజే సౌండ్లు.. నృత్యాలు
కడెం, సెప్టెంబర్ 23: వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, వినాయకుడి ప్రతిష్ఠాపన అనంతరం కొందరు 5 రోజుల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గురువారం కుంకుమపూజ కార్యక్రమాలు నిర్వహించిన మండలి సభ్యులు.. శుక్రవారం అన్నదానం చేపట్టారు. అదే రోజు రాత్రి నిమజ్జన ఉత్సవాలను నిర్వహించగా, శనివారం గ్రామ సమీపంలోని చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. వినాయకుడి నిమజ్జన ఉత్సవాల్లో స్థానిక యువకులు డప్పుచప్పుళ్లు, డీజే సౌండ్ల మధ్య నృత్యాలు చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఖానాపూర్ పట్టణంలో..
ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 23 : తన నివాసంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యకు ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్, కార్యకర్తలు భక్తి శ్రద్ధలతో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపయ్య విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్ ప్రధాన రహదారి వెంబడి మేళాతాళాలు, నృత్యాలతో ఊరేగించారు. స్థానిక గోదావరిలో ప్రశాంత వాతవరణంలో నిమజ్జనం చేశారు. కడెం జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు శనిగారపు శ్రావణ్, ఆకుల వెంకాగౌడ్, బలగం రమేశ్, సాబీర్ పాషా, సాడిగే ప్రసాద్, కొడిమ్యాల వీరేశ్, ఎర్రన్న, సల్ల వంశీ, షేక్ షఫీ, బీఆర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వెళ్లి రా వినాయకా..
దస్తురాబాద్, సెప్టెంబర్ 23 : మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గణనాథుల నిమజ్జనం వైభవంగా సాగింది. నిమజ్జనానికి ముందు ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లోని పలు వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. గణపతి బొప్ప మోరియా నినాదాలు మార్మోగాయి. బ్యాండ్ మేళాలు వాయిస్తూ యువతీ యువకులు, చిన్నారులు, నిర్వాహకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయా గ్రామ శివారులో ఉన్న గోదావరి, చెరువుల్లో గణేశ్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

