దండేపల్లి : మంచిర్యాల జిల్లా మండలంలోని కొండాపూర్ గ్రామానికి ( Kondapur village) చెందిన గ్రామపంచాయతీ మల్టిపర్పస్ వర్కర్ ప్రభాకర్ ( Prabhakar ) పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామానికి చెందిన తండ్రి, కుమారుడు భారతారపు లింగయ్య, కుమారస్వామి భూమి విషయమై మహిళతో గొడవపడ్డారు.
ఆమె జీపీ మల్టిపర్పస్ వర్కర్ ప్రభాకర్‌కు విషయాన్ని వివరించడంతో అతడు అక్కడికి చేరుకున్నాడు. దివ్యాంగుడైన ప్రభాకర్‌ను తండ్రి, కొడుకులు చితకబాదడడంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. దాడికి పాల్పడ్డ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎస్సై పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గ్రామస్థులు రాస్తారోకో చేశారు. ఎస్సై తహసీనోద్దిన్ రాస్తారోకో ప్రాంతానికి చేరుకుని గ్రామస్థులను శాంతిం చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ రమణమూర్తి హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.