తలమడుగు, ఫిబ్రవరి 12 : మండలకేంద్రం లో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. వేద పండితులు మహా యజ్ఞం నిర్వహించారు. చివరి రోజు వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. వేడుకలకు మండలంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భం గా వేంకటేశ్వరస్వామి నామ స్మరణతో ఆలయం మార్మోగింది.భక్తులతో కిటకిటలాడింది. సాయం త్రం గ్రామంలోని పలు వీధుల గుండా రథోత్సవం నిర్వహించారు. గ్రామ పెద్ద పిడుగు సంజీవ్ రెడ్డి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం అధికారి రమాకాంత్ రావు లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, సర్పంచ్ కళ్లెం కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నల్ల పద్మాకర్ రెడ్డి, మంతెన శ్రీకాంత్, పిడుగు సంజీవ్ రెడ్డి, అసం రవి, జాలం వెంకటేశ్, నవీన్ రెడ్డి పాల్గొన్నారు.