జైనూర్ : తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం నాయకులు వెంకటేష్ ముండే ( Venkatesh Munde) మహిళా శిశు సంక్షేమం, సామాజిక శాసనాల ఫౌండేషన్ తెలంగాణ చైర్మన్గా నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం చైర్మన్ గా నియమించింది. ఎవరైనా సామాజిక కార్యక్రమాలకు విరుద్ధంగా, మానవ హక్కులకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా బాధితులకు న్యాయం కలిగించేలా పౌండేషన్ పనిచేస్తుందని వెంకటేష్ ముండే తెలిపారు. తనను చైర్మన్గా నియమించినందుకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.