కూరగాయల నారు కేరాఫ్ గుడిహత్నూర్
గుడిహత్నూర్ మండలంలో కూరగాయలు అధికంగా పండిస్తారు. ఈ మండలం టమాటా సాగులో జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలుస్తోంది. అయితే కూరగాయల విత్తనాలు కొనుగోలు చేసి చేను లేదా ఇంటి వద్ద ఖాళీ స్థలంలో నారు తయారు చేసుకునే వారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు సక్రమంగా మొలకెత్తక పోవడంతో డబ్బులు, సమయం వృథా అయ్యేది.
- నర్సరీల్లో వివిధ రకాల వెజిటేబుల్స్ మొక్కలు
- గుడిహత్నూర్ మండలంలో 14 చోట్ల ఏర్పాటు
- ఒక్కో నర్సరీలో 10 లక్షల వరకు నారు సిద్ధం
- రైతులకు తప్పిన నారు పని భారం
గుడిహత్నూర్, జూలై 30 : గుడిహత్నూర్ మండలంలో కూరగాయలు అధికంగా పండిస్తారు. ఈ మండలం టమాటా సాగులో జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలుస్తోంది. అయితే కూరగాయల విత్తనాలు కొనుగోలు చేసి చేను లేదా ఇంటి వద్ద ఖాళీ స్థలంలో నారు తయారు చేసుకునే వారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు సక్రమంగా మొలకెత్తక పోవడంతో డబ్బులు, సమయం వృథా అయ్యేది. ఈ క్రమంలో కూరగాయల నారును ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకునే వారు. ఇదే నారును స్థానికంగా తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో కొందరు నర్సరీలను ప్రారంభించారు. వీటిలో మిరప, టమాటా, క్యాబేజీ, కాలీ ఫ్లవర్, వంకాయ తదితర నారును అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా మండలంలో 14 నర్సరీలు ఏర్పాటయ్యాయి.
నర్సరీ తయారీ
అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలాన్ని లీజు కు తీసుకొని రాతి స్తంభాలు, ఇనుప రాడ్లతో షెడ్ నెట్లను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. కొబ్బరి బూరుతో తయారైన ఎరువుతో(టెంకాయ) ప్రత్యేకమైన ట్రేలలో నారును తయారు చేస్తున్నారు. ఒక నర్సరీలో మిరప, టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ నారును అందుబాటులో ఉంచుతున్నా రు. దాదాపు ఒక్కో నర్సరీలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మొక్కలను పెంచుతున్నారు. డిమాండ్ బట్టి టమాటా ఒక మొక్క 80 పైసల నుంచి ఒక రూపాయి, మిర్చి రూ.1.50 నుంచి రూ.2లు, గోబి, వంకాయ ఒక రూపాయి, వివిధ రకాల బంతి పూల నారు రూ.3 నుంచి రూ.5 వరకు అమ్ముతున్నామని నర్సరీ నిర్వాహకులు తెలిపారు.
స్థానికులకు ఉపాధి..
నర్సరీల ఏర్పాటుతో స్థానిక కూలీలకు ఉపాధి ల భిస్తోంది. ఒక నర్సరీలో దాదాపుగా 10 నుంచి 15 మంది పని చేస్తుంటారు. ఇలా రోజు మండల పరిధిలో ఉన్న నర్సరీల్లో దాదాపుగా 200 మందికి ఉపాధి దొరుకుతున్నది. కోరుకున్న రకం నారు లభించడంతో రైతులతోపాటు ప్రత్యేకంగా కూరగాయలు సాగు చేసే వారు తీసుకెళ్తున్నారు. ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బజార్హత్నూర్, బేల, జైనథ్, తాంసి మండల రైతులతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల వారు నారును తీసుకెళ్తున్నారు.
భారం తగ్గింది..
గతంలో నారు కోసం నానా తిప్పలు పడ్డాం. ఇప్పుడు వివిధ రకాల కూరగాయల నారు దగ్గరలోనే లభిస్తుండడంతో అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాం. ఏ రకం విత్తనాల నారు కావాలన్నా.. లభిస్తుండడంతో కూరగాయల సాగుపై దృష్టి పెట్టాం. మార్కెట్ సౌకర్యం కూడా ఉంది.
– వైజునాథ్ కేంద్రె, రైతు, గుడిహత్నూర్
నాలుగేండ్లుగా తయారు చేస్తున్నా..
నాలుగు సంవత్సరాల నుంచి నారు తయారు చేస్తున్నా. రైతులు ఏ రకం నారు అడుగుతున్నారో ఆ రకం నారు పెంచి అందుబాటులో ఉంచుతున్నా. దీంతో ప్రతి యేటా కూరగాయల నారుకు డిమాండ్ పెరుగుతుండడంతో నర్సరీలను పెంచుతున్నాం.
– మెస్రం శంభు, నర్సరీ నిర్వాహకుడు, గుడిహత్నూర్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- Gudihatnur
- vegetable
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

