దిలావర్పూర్, నవంబర్ 5 ః ఉర్దూ, పార్శీ దైవ సందేహాలు అందుబాటులో ఉన్నాయని చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరావు తెలిపారు. ఆదివారం నిర్మల్ జిల్లాలోని నర్సపూర్(జీ) మండలంలోని పాత టెంబుర్నీలో గల దర్గా వద్ద 17వ శతాబ్దపు రెండు ఉర్దూ, పార్శీ భాషల్లో గల రెండు శాసనాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. మొదటి శాసనం నస్రూన్ మిన్, అల్లహే, వాఫత్హి, ఖరీబ్, రెండో శాసనం ఫల్లహు ఖైరూన్ హపీజాన్ ఉన్నాయి. వీటికి చాలా ప్రాధాన్యత ఉన్నదని ఆయన గుర్తించారు.