తాండూర్ : మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు, రోడ్ డ్యాంలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘం నాయకులు తాండూర్ (Tandur) తహసీల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరహార దీక్ష ( Hunger strike ) గురువారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకున్నది. దీక్షలకు తుడుందెబ్బ ( Tudum Debba ) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రాజ్ గోండ్ సమితి, గోండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్, ఆదివాసీ మహిళ సంఘం నాయకులు, మహిళలు పాల్గొని మద్దతు తెలిపారు.
నాయకులు మాట్లాడుతూ నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో రోడ్లు, వంతెనలు, అటవీ అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్కడ ఆదివాసీలు ఉంటే అక్కడే టైగర్ జోన్లు వస్తాయి. లేదా సింగరేణి ఓపెన్ కాస్ట్ మా వద్దే వస్తాయి. తమ గ్రామాలు మాత్రం అభివృద్ధికి దూరం ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కమిటీ తరపున డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అదివాసి నాయకులు కుర్సెంగ మోతీరామ్, మడావి గుణవంత్ రావు, మహిళా జిల్లా అధ్యక్షురాలు మర్సుకోల కమల, నాయకులు మదావి నర్సింగరావు, తుడుందెబ్బ తాండూర్ మండల అధ్యక్షుడు కర్సెంగ బాబురావు, నాయకులు కుడ్మేత అర్జున్, కనక మోతీరామ్, సిడాం శంకరమ్మ, విమలాబాయి, కవిత, అన్నపూర్ణ, రేణుక, తదితరులు పాల్గొన్నారు.