నార్నూర్ : ఆదివాసి వీరులు (Tribal Heroes) నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్ ( Todasam Nagorao) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసి నాయకుల ఆధ్వర్యంలో బిర్సా ముండా ( Birsa Munda) జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన వీరులు ఆదివాసి హక్కులతో పాటు స్వాతంత్రం కోసం, సాంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడారన్నారు. 1894లో ఆంగ్లేయులు, దోపిడిదారులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. అయినా నేటికీ ఆదివాసి సమాజం అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, భూ హక్కులు వంటి విషయాలలో గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. నేటితరం యువత ఆదివాసి వీరులను పూర్తిగా తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మడవి మాన్కు, ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు పూసం ఇస్తూ, మడవి ఆనందరావ్, ఆర్కా గోవింద్ తదితరులు ఉన్నారు.